జైనథ్: మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ అఖిల్ మహాజన్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిసెప్షన్, రికార్డులు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. అక్రమ రవా ణా, గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణ పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అ క్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేలా పటిష్టమైన నిఘా పెట్టాలని, తనిఖీలు నిర్వహించాలని సూచించారు. కేసుల దర్యాప్తును వేగవంతం చే సి ఆధారాలతో కూడిన చార్జీషీట్లను సకాలంలో దాఖలు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఎస్సై గౌతమ్ పవార్, సిబ్బంది ఉన్నారు.


