ఇక పక్కాగా సెగ్రిగేషన్‌ | - | Sakshi
Sakshi News home page

ఇక పక్కాగా సెగ్రిగేషన్‌

Sep 11 2026 9:34 AM | Updated on Sep 11 2026 9:34 AM

● బల్దియాకు రూ.8కోట్లు కేటాయింపు ● నిర్వహణ ఏజెన్సీల ఎంపికకు కసరత్తు ● ఈ నెలాఖరులోపు పనుల అప్పగింత

కై లాస్‌నగర్‌: ఆదిలాబాద్‌ మున్సిపల్‌ డంప్‌యార్డులో చెత్త సెగ్రిగేషన్‌ ఇక మరింత పక్కాగా చేపట్టనున్నారు. పారిశుద్ధ్య కార్మికులు రోజువారీగా పట్టణంలో సేకరించే తడి, పొడి చెత్తను ఎప్పటికప్పుడు వేరు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రూ.8కోట్ల నిధులు కేటాయించింది. వ్యర్థాల నిర్వహణను చేపట్టే ఏజెన్సీల ఎంపికకు ఇటీవల ఆన్‌లైన్‌లో టెండర్లు పిలిచిన మున్సిపల్‌ అధికారులు వాటిని నేడో, రేపో ఖరారు చేయనున్నారు. ఈ నెలాఖరులోపు ప్రక్రియ పూర్తి చేసి చెత్త సెగ్రిగేషన్‌ ప్రక్రియను ఎంపికై న ఏజెన్సీకి ఐదేళ్లపాటు నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారు.

చెత్త రహితంగా తీర్చిదిద్దాలనే..

పట్టణాలను చెత్తరహితంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్‌ మిషన్‌ (అర్బన్‌) 2.0ను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే మూడేళ్ల కిందట బయోమైనింగ్‌ వి ధానాన్ని అమలు చేసింది. దీని ద్వారా పట్టణంలో ని డంప్‌యార్డులో ఏళ్లుగా గుట్టలుగుట్టలుగా పేరుకుపోయిన చెత్తను ఈ ప్రక్రియ ద్వారా తొలగించా రు. ఇటీవలే బయోమైనింగ్‌ ప్రక్రియ గడువు ముగి సింది. అయితే, పట్టణ పరిధిలో నిత్యం 60 నుంచి 70టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. పారిశుద్ధ్య కా ర్మికులు చెత్త సేకరణ వాహనాల ద్వారా ఇంటింటా సేకరించిన చెత్తను డంప్‌యార్డుకు తరలిస్తున్నారు. బయోమైనింగ్‌ జరగకపోవడంతో మళ్లీ చెత్త నిల్వ లు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. దుర్గంధం వ్యా పించడంతోపాటు తరచూ చెత్తకు నిప్పంటుకుని వచ్చే పొగతో సమీప గ్రామాల ప్రజలు, పంట చేలలోని రైతులు ఇక్కట్లు పడుతున్నారు. పర్యావరణా నికీ ముప్పు వాటిల్లే ప్రమాదముంది. దీన్ని గుర్తించిన ప్రభుత్వం చెత్తను ఎప్పటికప్పుడు వేరు చేయాలని ఆదేశిస్తూ ప్రత్యేక నిధులు కేటాయించింది.

ఏజెన్సీల ఎంపికకు టెండర్లు

పట్టణంలో చెత్త సెగ్రిగేషన్‌ నిర్వహణ చేపట్టేందుకు అర్హత, ఆసక్తి కలిగిన ఏజెన్సీల ఎంపికకు మున్సిపల్‌ అధికారులు ఇటీవల ఆన్‌లైన్‌లో టెండర్లు పిలిచారు. రెండుసార్లు టెండర్లు ఆహ్వానించగా వాటికి ఎలాంటి స్పందన రాలేదు. తాజాగా ఇటీవల మూడోసారి పిలవగా రెండు ఏజెన్సీల నుంచి ప్రతిపాదనలు అందాయి. ఇందులో అన్ని అర్హతలున్న ఏజెన్సీని ఎంపిక చేయనున్నారు. ఎంపికై న ఏజెన్సీ చెత్తను వేరు చేసేందుకు డంప్‌యార్డులోని అరెకరంలో ప్రత్యేక షెడ్లు నిర్మించాల్సి ఉంటుంది. వ్యర్థాల నిర్వహణకు అవసరమయ్యే 11రకాల అధునాతన యంత్రాలను బల్దియాకు కొనుగోలు చేసి ఇవ్వడంతో పాటు ఐదేళ్లపాటు సదరు ఏజెన్సీనే చెత్త నిర్వహణ బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. ఇందుకు గాను ఏజెన్సీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సీడీఎంఏనే చెల్లింపులు చేయనుంది. ప్రత్యేక యంత్రాల ద్వారా వేరు చేసిన చెత్తలోని తడి చెత్తతో కంపోస్టు ఎరువు తయారు చేయనున్నారు. ప్లాస్టిక్‌ కవర్లు, ఐరన్‌రాడ్లు, కాగితాలు, రబ్బర్లు, దుస్తులు, ఇనుము, గాజు సీసాలు.. ఈ వ్యర్థాలుగా వేరుపడిన చెత్తను స్వయం సహాయక సంఘాలకు అప్పగించనున్నారు. వాటి నిర్వహణ ద్వారా ఎస్‌హెచ్‌జీలకూ ఆర్థికంగా ఆదాయం లభించనుందని భావిస్తున్నారు.

త్వరలో వర్క్‌ ఆర్డర్‌ ఇస్తాం

చెత్తను వేరు చేసే పనుల నిర్వహణ ఏజెన్సీల ఎంపికకు టెండర్ల ప్రక్రియ చేపట్టాం. రెండు ఏజెన్సీలు టెండర్‌ దాఖలు చేయగా వాటి వివరాలతో కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపించాం. అర్హత కలిగిన ఏజెన్సీని ఎంపిక చేసి త్వరలోనే వర్క్‌ ఆర్డర్‌ అందజేస్తాం. ఈ నెలాఖరులోపు ఈ ప్రక్రియ పూర్తి చేసి త్వరలోనే పనులు ప్రారంభించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. – పి.అరుణ్‌కుమార్‌, మున్సిపల్‌ ఇంజినీర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement