ఉట్నూర్‌రూరల్: గిరిజన విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేద్దామని జిల్లా గిరిజన సంక్షేమశాఖ డీడీ అశోక్‌కుమార్ పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలోని కేబీ కాంప్లెక్స్ పీఎంఆర్‌సీ భవనంలో గిరిజన ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వసతిగృహ సంక్షేమాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడారు. పాఠశాలలు, వసతిగృహాల్లోని సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రతీనెల 3వ శనివారం తప్పనిసరిగా పేరెంట్స్, టీచర్స్ సమావేశం ఏర్పాటు చేయాలని, విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. నిర్దేశిత సమయంలో సిలబస్ పూర్తి చేయాలని సూచించారు. మెస్ కమిటీలు ఏర్పాటు చేసి నిత్యం నిర్ణీత మెనూ పక్కాగా అమలు చేయాలని పేర్కొన్నారు. బెడ్‌షీట్లు, టవల్స్, షూస్, బ్యా గులు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ వివరా లు తెలుసుకున్నారు. ఆర్వో ప్లాంట్ల నిర్వహణపై ప్ర త్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. అనంతరం స మావేశానికి హాజరైన ఐటీడీఏ ఇన్‌చార్జి ప్రాజెక్ట్ అధి కారి రాజేశ్వరరావుకు జిల్లాలోని విద్యావ్యవస్థ తీరు ను వివరించారు. పోక్సో చట్టంపై రూపొందించిన క్యాలెండర్‌ను ఆవిష్కరించి అన్ని పాఠశాలలకు పంపిణీ చేశారు. ఏపీవోలు వసంతరావు, భాస్కర్, డిప్యూటీ డీఈవో చందన్, ఏటీడీవో క్రాంతి, జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, జీసీడీవో ఛాయా, ఏవో సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.


