కై లాస్‌నగర్: కర్వీ అండ్ రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అ భియాన్ (ఆర్‌జీఎస్‌ఏ)లో భాగంగా జిల్లాలోని ఎంపీడీవో కార్యాలయాలు, గ్రామపంచాయతీల్లో పని చేస్తున్న డాటా ఎంట్రీ (కంప్యూటర్) ఆపరేటర్ల బదిలీల ప్రక్రియ గురువారం ప్రశాంతంగా ముగి సింది. జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ ఎస్.రాజేశ్వర్ 28 మందికి కౌన్సిలింగ్ నిర్వహించారు. నార్నూర్ మండలంలో పనిచేస్తున్న ఆపరేటర్‌ను వయస్సు రీత్యా బదిలీల నుంచి మినహాయింపునిచ్చారు. మిగతా 27మందికి వారి అభీష్టం మేరకు ఎంపిక చేసుకున్న మండలాలకు బదిలీ చేశారు. కొత్త మండలాలు, పంచాయతీల్లో విధుల్లో చేరి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ వారికి సూచించారు. జిల్లా పంచాయతీ అధికారి జి.రమేశ్, డీఎల్పీవో ఫణీందర్‌రావు, సీనియర్ అసిస్టెంట్ కల్పన తదితరులున్నారు.


