జిల్లాలోని గ్రామపంచాయతీలు 473
గ్రామీణ ప్రాంతాల జనాభా 5,41,230
తొలివిడత వచ్చే నిధులు రూ.40కోట్లు
కై లాస్‌నగర్: 16వ ఆర్థిక సంఘాన్ని అమల్లోకి తెచ్చి న కేంద్ర ప్రభుత్వం గ్రామపంచాయతీల్లో ఆర్థిక క్రమశిక్షణను మెరుగుపరుస్తూ.. నిధుల దుర్విని యోగానికి అడ్డుకట్ట వేసేదిశగా దృష్టి సారించింది. ఏడాది కాలంలో పంచాయతీల్లో చేపట్టనున్న అభివృద్ధి పనుల ప్రణాళికల రూపకల్పనకు ఆదేశించింది. జనాభా ప్రాతిపాదికన కేటాయించే నిధులు, వాటితో చేపట్టనున్న పనుల అంచనాలను రూపొందించాలని స్పష్టం చేసింది. కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా చర్యలు చేపట్టిన అధికారులు ప్రతీ పంచాయతీకి అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ)ని సిద్ధం చేశారు. తొమ్మిది అంశాలతో తయారు చేసిన ప్రణాళికల వివరాలను ఈ గ్రామ స్వరాజ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేశారు.
ప్రతీ పంచాయతీకి ప్రణాళిక
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందే 16వ ఆర్థికసంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులతో పాటు పంచాయతీల్లో సమకూరనున్న జనరల్ ఫండ్‌ను సద్వి నియోగం చేసుకుని ఆదర్శ పంచాయతీలుగా తీర్చి దిద్దాలనే ఉద్దేశంతో కేంద్రం జీపీడీపీ రూపకల్పనకు ఆదేశించింది. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, వీధి దీపాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో కనీస మౌలిక వసతులు కల్పించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని, ఏయే రంగాలకు ఎంత నిధులు వెచ్చించాలనే దిశగా నివేదిక రూపొందించాలని సూచించింది. వీటితో పాటు గ్రామాలు ఆదర్శంగా నిలిచేలా తొమ్మిది అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపింది. ఆయా అంశాల్లో నిధులు వెచ్చించే దిశగా ఏడాదికి సంబంధించిన ప్రణాళికలు కోరింది. కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా కదిలిన పంచాయతీ సెక్రటరీలు, అ ధికారులు గ్రామాల వారీగా ప్రణాళికలు సిద్ధం చేశా రు. వందశాతం నిధులకు గాను 120శాతం బడ్జెట్‌తో కూడిన ప్రతిపాదనలతో కూడిన ప్రణాళికను సిద్ధం చేసి కేంద్ర పోర్టల్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ ప్రక్రియ గత నెల 31వ తేదీతో ముగిసింది.
నిధుల దుర్వినియోగానికి చెక్
ముందుగా సిద్ధం చేసిన ప్రణాళిక ప్రకారంగానే అభివృద్ధి పనులకు నిధులు వెచ్చించాల్సి ఉండటంతో దుర్వినియోగానికి అడ్డుకట్ట పడనుంది. ఇష్టారాజ్యాంగా ఖర్చు చేసే అవకాశం లేకపోవడంతో ఆర్థిక క్రమశిక్షణ పెరగనుంది. ప్రతీ పనికి ఓ ప్రత్యేక కోడ్ ఉంటుంది. దాని ప్రకారంగానే పూర్తి చేసిన పనుల వివరాలు, ఫొటోలను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం సర్పంచ్, పంచాయతీ సెక్రటరీల లాగిన్ల ద్వారా ఆ పనులకు సంబంధించిన చెక్ జనరేట్ అవుతుంది. దీంతో డబ్బులు వృఽథాగా ఖర్చు చేసే అవకాశముండదు. ఫలితంగా పారదర్శకమైన అభివృద్ధికి బాటలు పడే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏటా ఫిబ్రవరి నెలాఖరులోపు ఈ ప్రణాళికను సిద్ధం చేసి పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
నిధుల వినియోగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన మార్గదర్శకాలను నిర్దేశించాయి. బేసిక్ గ్రాంట్ కింద 80శాతం నిధులు వినియోగించాలని సూచించింది. 50శాతం టైడ్ గ్రాంట్స్‌ను శానిటేషన్, తాగునీరు, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, ఆన్‌టైడ్ 50శాతం గ్రాంట్స్‌లో 20శాతం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సీసీ రోడ్లు, డ్రైనేజీలకు వెచ్చించాల్సి ఉంటుంది. మరో 30శాతం నిధులను ఇతర అవసరాలకు వినియోగించుకునేలా ఆదేశించింది. 20శాతం ఫార్మర్స్‌మెన్స్ గ్రాంట్ కింద వినియోగించాల్సి ఉంటుంది. 10శాతం స్టేట్ ఫార్మర్స్‌మెన్స్, మరో 10శాతం రూరల్ లోకల్ బాడీస్ ఫార్మర్స్‌మెన్స్ కింద వినియోగించాల్సి వస్తోంది. కేంద్రం విడుదల చేసే నిధుల్లో కనీసం 20శాతం నిధులు విడుదల చేస్తే రాష్ట్ర ఫార్మర్స్‌మెన్స్ కింద పరిగణించబడుతుంది. గ్రామాల్లో ఆర్థిక వనరులను సమీకరించుకుంటే ఆర్‌ఎల్‌బీ ఫార్మర్స్‌మెన్స్ కిందకు వస్తోంది. ఒక్కో ఇంటికి రూ.1,200 కింద వసూలు చేసినట్లయితే దీనికింద పరిగణించబడుతుంది.
నిధుల వినియోగం ఇలా..


