● సాఫీగా భూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ
కై లాస్‌నగర్: జిల్లాలో భూ భారతి అవుట్ సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ల గై ర్హాజర్‌తో భూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో కలుగుతున్న ఇబ్బందులను వివరిస్తూ ‘శిక్షణ ఇచ్చారు.. లాగిన్లు మరిచారు’ శీర్షికన ఈ నెల 2న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. భూ భా రతి ఆపరేటర్ల తొలగింపుతో జూనియర్ అసిస్టెంట్లకు భూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిర్వహణపై అధికార యంత్రాంగం ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. అయితే, వారికి లాగిన్లు ఇవ్వకుండా తొలగించిన ఆపరేటర్లతోనే విధులు నిర్వహించడాన్ని ఈ కథనంలో ప్రస్తావించింది. ఇందుకు కలెక్టర్ రాజర్షి షా స్పందించారు. 20 గ్రామీణ మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో పనిచేస్తూ శిక్షణ పొందిన జూనియర్ అసిస్టెంట్లకు ప్రత్యేక లాగిన్లు క్రియేట్ చేసి వారికి భూ భారతి నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని ఆదేశించా రు. ఇందుకు అనుగుణంగా చర్యలు చేపట్టిన అధికారులు జూనియర్ అసిస్టెంట్లకు లాగిన్లు క్రియేట్ చేశారు. దీంతో భూ రిజిస్ట్రేషన్ల ప్రక్రి య వారి ఆధ్వర్యంలో మొదలైంది. ఇక నుంచి ప్రక్రియ సాఫీగా సాగడంతోపాటు భూ రిజిస్ట్రేషన్లలో జరిగే అక్రమాలకు కూడా చెక్ పడనుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.


