వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలి | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలి

Sep 4 2026 2:18 AM | Updated on Sep 4 2026 2:18 AM

● ఎంపీ గోడం నగేశ్‌ ● ఆకట్టుకున్న కిసాన్‌ మేళా

కై లాస్‌నగర్‌: వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చుకోవాలని ఎంపీ గోడం నగేశ్‌ పిలుపునిచ్చా రు. యంత్ర పరికరాలు, ఆధునిక సాంకేతికతో పంటల సాగు విధానంపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఆత్మ ఆధ్వర్యంలో గురువారం మావల మండల కేంద్రంలోని చిలుకూరి లక్ష్మి గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కిసాన్‌ మేళాను కలెక్టర్‌ రాజర్షి షా, ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌తో కలిసి ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడు తూ.. వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మా ర్కెట్‌లో డిమాండ్‌ పెంచేందుకు ఎగుమతి అవకాశాలను విస్తరించాల్సిన అవసరముందన్నారు. కలెక్టర్‌ రాజర్షి షా మాట్లాడుతూ.. కొత్త గోదాముల నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు తెలిపారు. వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లు ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌, మార్కెట్‌ కమిటీ, మున్సిపల్‌ చైర్మన్లు బోరంచు శ్రీకాంత్‌రెడ్డి, బండారి అనూష, ఆదిలాబాద్‌, బోథ్‌, ఇచ్చోడ ఆత్మ చైర్మన్లు సంతోష్‌రావు, రాజు, నారాయణ, జిల్లా వ్యవసాయశాఖ అధికారి రవీందర్‌సింగ్‌, పశుసంవర్ధకశాఖ అధికారి రాథోడ్‌ రామారావు, ఉద్యానశాఖ అధికారి సందీప్‌కుమార్‌, డీఆర్డీవో రాథోడ్‌ రవీందర్‌, శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

కష్టపడే కార్యకర్తలకు ప్రాధాన్యం

ఆదిలాబాద్‌: పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతీ కార్యకర్తకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని ఎంపీ గోడం నగేశ్‌ పేర్కొన్నారు. ప్రధాని మోదీ 25 ఏళ్ల సేవా అంకితభావాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈ నెల 17నుంచి అక్టోబర్‌ 17వరకు సేవా సంకల్ప అభియాన్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలి పారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో అభియాన్‌పై నిర్వహించిన కార్యశాలలో ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌తో కలిసి హాజరై మాట్లాడారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్‌, రాష్ట్ర అధికార ప్రతినిధి ముస్తాపురే అశోక్‌, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు తాటిపల్లి గంగాధర్‌రావు, దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి వాగ్మారే శైలేందర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి గటిక క్రాంతికుమార్‌, మహిళా మోర్చా అధ్యక్షురాలు జాదవ్‌ సుమన్‌బాయి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement