కై లాస్‌నగర్: అంగన్‌వాడీ భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచి గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అంగన్‌వాడీ కేంద్రాలు, నూతన భవనాలు, మరుగుదొడ్లు, పీఎం జన్‌మన్, ఉపాధిహామీ, గ్రామపంచాయతీ భవన నిర్మాణాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా పనుల పురోగతిని పరిశీలించి పెండింగ్ పనులను ప్రాధాన్యతతో పూర్తి చేయాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ గడువులోపు లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు. మహిళా, శిశు సంక్షేమశాఖాధికారి మిల్కా, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, డీపీవో రమేశ్, వివిధ శాఖల ఇంజినీరింగ్ అధికారులు, సీడీపీవోలు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.
బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలి
బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎయిడ్ ఎన్జీవో ఆధ్వర్యంలో బాల్య వి వాహ ముక్త భారత్‌కు సంబంధించిన ప్రచార పోస్ట ర్ ఆవిష్కరించి మాట్లాడారు. ఆడపిల్లల రక్షణ, సంరక్షణకు జేజేబీ కోర్టు, చైల్డ్‌లైన్, ఐసీపీఎస్, ఎయిడ్ ఎన్జీవో పనిచేస్తున్నాయని తెలిపారు. ఆపదలో ఉన్న వారు డయల్ 1098, 100 నంబర్లకు కాల్ చేయాల ని సూచించారు. అధికారులు మిల్కా, రాథోడ్ ర వీందర్, రమేశ్, రాథోడ్ శివరాం, ఉమాదేవి, ఎన్జీ వో జిల్లా కోఆర్డినేటర్ వినోద్, కమ్యూనిటీ మొబిలైజర్లు సంపత్ కిరణ్, శంకర్ తదితరులున్నారు.


