ఎయిడ్స్‌ రహిత సమాజమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ఎయిడ్స్‌ రహిత సమాజమే లక్ష్యం

Aug 23 2026 1:28 AM | Updated on Aug 23 2026 1:28 AM

● కలెక్టర్‌ రాజర్షిషా

● కలెక్టర్‌ రాజర్షిషా

ఆదిలాబాద్‌: ఎయిడ్స్‌ రహిత సమాజమే లక్ష్యంగా ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాలని కలెక్టర్‌ రాజర్షిషా అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, ఎయిడ్స్‌ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఇంటెన్సిఫైడ్‌ ఐఈసీ క్యాంపెయిన్‌–2026’లో భాగంగా శనివారం స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద బైక్‌ ర్యాలీని కలెక్టర్‌ ప్రారంభించి మాట్లాడారు. హెచ్‌ఐవీని ముందస్తుగా గుర్తించి సకాలంలో చికిత్స అందించడం ద్వారా వ్యాధి వ్యాప్తిని నియంత్రించవచ్చని తెలిపారు. ఆగస్టు 12 నుంచి అక్టోబర్‌ 12 వరకు రెండు నెలల పాటు జిల్లా వ్యాప్తంగా ‘ఎయిడ్స్‌ సురక్ష మాస్‌ క్యాంపెయిన్‌’ ద్వారా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హెచ్‌ఐవీ స్కీన్రింగ్‌ను రిమ్స్‌, ఉట్నూర్‌, బోథ్‌ ఆసుపత్రులకే పరిమితం చేయకుండా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించాలన్నారు. పాజిటివ్‌గా తేలిన వారి వివరాలను గోప్యంగా ఉంచి, ఏఆర్‌టీ కేంద్రాల ద్వారా ఉచిత చికిత్స అందించాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో సాధన, డీవైఎస్‌వో దయానంద్‌ రెడ్డి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధి నాగరాజు, ఐసీటీసీ కౌన్సెలర్లు, పీహెచ్‌సీల వైద్యులు, సిబ్బంది, యువత పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement