వినాయక నవరాత్రులకు రూ.34.50 లక్షలు | - | Sakshi
Sakshi News home page

వినాయక నవరాత్రులకు రూ.34.50 లక్షలు

Aug 23 2026 1:28 AM | Updated on Aug 23 2026 1:28 AM

● కౌన్సిల్‌ సమావేశంలో ఎజెండాకు ఆమోదం ● బీజేపీ కౌన్సిలర్ల గైర్హాజరు

● కౌన్సిల్‌ సమావేశంలో ఎజెండాకు ఆమోదం ● బీజేపీ కౌన్సిలర్ల గైర్హాజరు

కై లాస్‌నగర్‌: రానున్న వినాయక నవరాత్రు ల ఏర్పాట్ల కోసం రూ.34.50 లక్షల కేటాయింపు ప్రతిపాదనలకు మున్సిపల్‌ కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. నిధుల కేటాయింపే ఏకై క ఎజెండాగా చైర్‌పర్సన్‌ బండారి అనూష అధ్యక్షతన శనివారం మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బీజేపీ కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ఈ నె లాఖరులో ఉండనున్న నేపథ్యంలో వ్యూహాత్మకంగానే వారు సమావేశానికి దూరంగా ఉన్నారనే చర్చ సాగుతుంది. అయితే బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, ఎంఐఎం పార్టీలకు చెందిన కూటమి కౌన్సిలర్లు హాజరై ఏర్పాట్లపై చర్చించారు. పట్టణంలోని 49 వార్డుల్లో వినాయక నవరాత్రులను వైభవంగా నిర్వహించేలా నిధుల కేటాయింపు చేశారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో గ్రావెల్‌, మొరం, డస్ట్‌, వెట్‌ మిక్స్‌ కోసం రూ.10లక్షలు, సీసీ ప్యాచ్‌వర్క్‌ల కోసం మరో రూ.10 లక్షలు కేటాయించారు. లైటింగ్‌, అంబేడ్కర్‌ చౌక్‌ వద్ద స్టేజ్‌ ఏర్పాట్లు, పెన్‌గంగా నది, చాందావాగు వద్ద క్రేన్‌లు, లైటింగ్‌తో పాటు బారికేడ్ల ఏర్పాటుకు కలిపి మొత్తంగా రూ.34.50 లక్షల కేటాయింపుతో కూడిన ప్రతి పాదనలకు మున్సిపల్‌ కౌన్సిల్‌లో తీర్మానం చేశారు. చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ పట్టణంలోని 49 వార్డుల్లో గణేశ్‌మండపాలు, ప్రధాన చౌరస్తాల వద్ద లైటింగ్‌ వ్యవస్థను పటిష్టంగా ఏర్పా టు చేయాలని అధికారులను ఆదేశించారు. శానిటేషన్‌ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, బ్లీచింగ్‌,క్లీనింగ్‌ తదితర పారిశుద్ధ్య కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. నవరాత్రుల సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో వైస్‌చైర్మన్‌ రోహిత్‌, కమిషనర్‌ జగదీశ్వర్‌గౌడ్‌, ఎంఈ అరుణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement