120 కుటుంబాలు.. 310 మందికి ఉద్యోగాలు వంద మందికి పైగా టీచర్లే బలిరాం స్ఫూర్తితో యువత ముందుకు.. అన్ని శాఖల్లో ఎంపికవుతున్న గ్రామస్తులు
గ్రామానికి చెందిన వెంకట్రామ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేసి రెండేళ్ల క్రితం ఉద్యోగ విరమణ పొందాడు. ప్రస్తుతం ఈ గ్రామ సర్పంచ్‌గా కొనసాగుతున్నాడు. ఇతడికి ఆరుగురు సంతానం. ఐదుగురు కుమారులు, కుమార్తె. పెద్ద కుమారుడు రాంకిష న్, మూడో కుమారుడు మధన్‌లాల్, నాలు గో కుమారుడు శ్యాంలాల్ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా కొనసాగుతున్నారు. రెండో అబ్బాయి కాంత్రికుమార్ ప్రస్తుతం కేంద్ర సర్వీసులో డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. కూతురు సైతం గవర్నమెంట్ టీచర్ కావడం గమనార్హం.
ప్రసుతం గ్రామనాయక్‌గా ఆడె గంగారాం కొనసాగుతున్నాడు. ఈయన సోదరుడు వసంత్‌రావునాయక్ ఎకై ్సజ్ సీఐగా విధులు నిర్వర్తిస్తున్నాడు. గంగారాంకు నలుగురు సంతానం. ముగ్గురు కుమారులు, కుమార్తె. ఇందులో నూర్‌సింగ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాగా అమర్‌సింగ్ డిప్యూ టీ రేంజ్ ఆఫీసర్, మరో కుమారుడు అశోక్, కుమార్తె సుజాత కూడా సర్కారు ఉద్యోగులే.
ఉద్యోగాల ఊరు.. వెంకటాపూర్
ఇచ్చోడ: వెంకటాపూర్.. ఓ మారుమూల గిరిజన గ్రామం. నేరడిగొండకు 11కిలోమీటర్ల దూరాన అటవీప్రాంతంలో ఉంటుంది. గ్రామస్తులంతా దా దాపు రైతులే. నాడు ఈ ఊరికి కనీసం రోడ్డు లేదు. మండల కేంద్రానికి రావాలంటే ఎడ్లబండి లేదా కాలినడకే దిక్కు. అలాంటి గ్రామంలో 1969లో రూపావత్ బనియా(బలిరాం) మొదటగా సర్కారు కొలువు సాధించాడు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాడు. ఆయన స్ఫూర్తితో మొదలైన ప్రస్థానం క్రమంగా ఇంటికో ఉద్యోగం వచ్చేలా మారిపోయింది. నాడు ఈ ఊరిలో 50 కుటుంబాల వరకు ఉండగా అందరూ నిరాక్షరాస్యులే. ఆ సమయంలో పక్క ఊరు కుంటాలలో బనియా టీచర్‌గా కొనసాగాడు. అతడికి ముగ్గురు సంతానం. తన మాదిరిగా వారు కూడా సర్కారు కొలువు సాధించేలా చిన్నప్పటి నుంచి ప్రోత్సహించాడు. ఆయన భౌతికంగా దూరమైన ఆ ప్రేరణతో ఆ ముగ్గురూ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అంతేకాదు ఆ ఊరివారంతా ఆ టీచర్‌ను ఆదర్శంగా తీసుకుని తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. సర్కారు కొలువులే లక్ష్యంగా తీర్చిదిద్దారు.
అన్ని శాఖల్లో గ్రామస్తులు..
గ్రామ జనాభాలో దాదాపు సగం మంది వరకు ప్ర భుత్వ ఉద్యోగులుగా ఎంపికయ్యారు. ఇందులో ఎ క్కువగా ఉపాధ్యాయులే ఉన్నారు. తర్వాత స్థానా ల్లో రెవెన్యూ, పోలీస్, బ్యాంకు, అటవీశాఖ, పంచా యతీరాజ్, రైల్వే, ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్, వ్యవసాయశాఖ, ఎకై ్సజ్, ఐసీడీఎస్, హౌసింగ్, ట్రాన్స్‌కో, జేన్‌కో, భూగర్భజల, హాస్టల్ వెల్ఫేర్, వైద్య ఆరోగ్య, పశుసంవర్ధక తదితర శాఖల్లో సేవలందిస్తున్నారు.
100 మంది ఆడపడుచులు సైతం...
ఈ గ్రామ ఆడపడుచుల్లో 80 మంది వరకు ప్రభు త్వ ఉపాధ్యాయులు కాగా మరో 20 మంది ఇతర శాఖల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం వీరంతా తమ అత్తగారి ఇళ్లలో ిస్థిరపడ్డారు.
గ్రామ ప్రొఫైల్
జనాభా: 684
మహిళలు :320, పురుషులు : 364
మొత్తం కుటుంబాలు : 120
ఉద్యోగాలు ఉన్న కుటుంబాలు : 120
పురుష ఉద్యోగులు : 210
మహిళా ఉద్యోగులు : 100
ఇంటికో ఉద్యోగం.. అవునండీ మీరు విన్నది నిజమే. ఆ ఊరిలో ప్రతీ గడపలో కనీసం ఒకరు సర్కారు కొలువు సాధించారు. అంతేకాదు.. కుటుంబంలో గరిష్టంగా ఏడుగురు వరకు ప్రభుత్వ విధుల్లో కొనసాగడం ప్రత్యేకం. ఓ ఉపాధ్యాయుడి స్ఫూర్తి.. మరో ప్రజాప్రతినిధి చేయూతకు అకుంఠిత దీక్ష తోడైంది. పట్టుదల, అలుపెరగని పోరాటం వారిని విజయతీరాలకు చేర్చింది. ఆ కొలువుల ఊరే నేరడిగొండ మండలంలోని వెంకటాపూర్. ఆ మారుమూల గ్రామం విజయగాథపై ఈ వారం సండే స్పెషల్.
వెంకట్రామ్ కుటుంబంలో ఏడుగురు..
గంగారాం నాయక్ ఇంట్లో ఐదుగురు..


