డిప్యూటీ ఎంపీడీవో దంపతులకు సత్కారం | - | Sakshi
Sakshi News home page

డిప్యూటీ ఎంపీడీవో దంపతులకు సత్కారం

Aug 1 2026 2:07 AM | Updated on Aug 1 2026 2:07 AM

సంతనూతలపాడు: సంతనూతలపాడు మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో శుక్రవారం ఉద్యోగ విరమణ పొందిన డిప్యూటీ ఎంపీడీవో పి.రవికుమార్‌, ఉషారాణి (టీచర్‌) దంపతులను అధికారులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి సంతనూతలపాడు ఎంపీడీవో డి.సురేష్‌బాబు అధ్యక్షత వహించగా, ఎంపీపీ బుడంగుంట విజయ, జెడ్పీటీసీ దుంపా రమణమ్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పలు మండలాల ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ రవికుమార్‌ 37 సంవత్సరాల పాటు వైద్యారోగ్య, పంచాయతీరాజ్‌ శాఖలకు అందించిన విశిష్ట సేవలను ప్రశంసించారు. మండలంలో డిప్యూటీ ఎంపీడీవోగా పనిచేసి ఉత్తమ సేవలు అందించినట్లు ఎంపీడీవో తెలిపారు. క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేసి అందరి మన్ననలు పొందిన రవికుమార్‌ సేవలను ఎంపీపీ, జెడ్పీటీసీలతో పాటు ఎంపీడీవోలు డీఎస్సీ ప్రసాద్‌, దారా వెంకట్రావు, శ్రీనివాసరావు, కుసుమ కుమారి తదితరులు కొనియాడారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవోలు రామ్మోహన్‌, శ్రీనివాసరావు, విజయ్‌ భాస్కర్‌, సుబ్బారావు, ఎంఈఓ డి.వెంకారెడ్డి, వెలుగు ఏపీఎం టీ బాబూరావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ బి.మధుసూదన్‌రావు, మండల పరిషత్‌ ఏవో ప్రసన్నకుమారి, ఏపీవో వాసంతి, చిలకపాడు హైస్కూల్‌ హెచ్‌ఎం పి.స్వప్నరాజు, పంచాయతీ అభివృద్ధి అధికారులు ఎన్‌.ప్రతాప్‌ కుమార్‌, ఆర్‌.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మండల పరిషత్‌, వెలుగు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌, సచివాలయాలు, వైద్యారోగ్యశాఖ సిబ్బంది, రవికుమార్‌ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకు ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement