● రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి
కై లాస్‌నగర్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను నిర్దేశిత గడువులోపు పూర్తిచేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్, పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని సూచించారు. కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ, జిల్లాలో ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియ 97.15 శాతం పూర్తయిందన్నారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓట రు జాబితాలో నమోదయ్యేలా అన్ని రాజకీయ పార్టీల సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ పూర్తి పారదర్శకతతో ఎస్‌ఐఆర్ ప్రక్రియను పూర్తి చేస్తామని స్పష్టం చేశా రు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ ఆర్‌ఎస్ చిత్రు, డీఆర్‌వో స్రవంతి, ఆర్‌డీవో జగదీశ్వర్‌రావు, ఎన్నికల విభాగం పర్యవేక్షకురా లు నలంద ప్రియా తదితరులు పాల్గొన్నారు.
నిరుద్యోగులకు తీపి కబురు
ఆదిలాబాద్‌టౌన్:నిరుద్యోగ అభ్యర్థులకు ప్రభు త్వం ఎట్టకేలకు తీపి కబురు అందించింది. కొ ద్ది రోజులుగా ఎదురుచూస్తున్న ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బుధవారం నోటిఫికేషన్ విడుదల చేయడంతో అభ్యర్థుల్లో హర్షం వ్యక్తమవుతుంది. ఇప్పటికే చాలా మంది మైదానాల్లో కసరత్తుతో పాటు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. త్వరలో ఈ పోస్టులు భర్తీ కానున్నాయి. బాసర జోన్ పరిధి లో 25 సివిల్ ఎస్సై, రెండు ఏఆర్ ఎస్సై, 5 ఫైర్‌మెన్ ఎస్సై పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటితో పాటు టీజీఎస్పీఎస్సై పోస్టు 1, డిప్యూ టీ జైలర్ మేల్ 2 పోస్టులు, ఆదిలాబాద్ జిల్లా పరిధిలో 130 సివిల్ కానిస్టేబుల్, 56 ఏఆర్ కానిస్టేబుల్, 12 ఫైర్ కానిస్టేబుల్, జైల్ మేల్‌వార్డర్ 4 పోస్టులు భర్తీ కానున్నాయి.


