కలెక్టరేట్‌ ఎదుట ఎన్‌పీఆర్‌డీ ధర్నా | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌ ఎదుట ఎన్‌పీఆర్‌డీ ధర్నా

Jul 27 2026 11:55 PM | Updated on Jul 27 2026 11:55 PM

కై లాస్‌నగర్‌: ఎన్నికల సమయంలో దివ్యాంగులకిచ్చిన హామీలు ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఎన్‌పీఆర్‌డీ జిల్లా అధ్యక్షుడు నగేశ్‌ డిమాండ్‌ చేశారు. దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని సోమవారం కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఆ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ దివ్యాంగులకు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అమలు చేయడం లేదన్నారు. 2023 నుంచి 2025 వరకు వీల్‌చైర్లు, ట్రై సైకిళ్ల కోసం దరఖాస్తులు చేసుకున్న దివ్యాంగులకు వాటిని ఇంకా అందించలేదన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో ఐదు శాతం, ఆర్టీసీ బస్సులో గౌరవం కల్పించా లని డిమాండ్‌ చేశారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి తమ సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్ర ధాన కార్యదర్శి ఆరిఫా బేగం, గంగసాగర్‌, ఆశ న్న, ఆర్‌.మంజుల తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement