అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య

Jul 27 2026 11:55 PM | Updated on Jul 27 2026 11:55 PM

లక్సెట్టిపేట: మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన గుండారపు మహేష్‌(35) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక ఏఎస్సై అన్వర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మహేష్‌ ఇటీవల వ్యాన్‌ కొనుగోలు చేసి నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాడు. వ్యాన్‌ నెల వాయిదా డబ్బులు చెల్లించేందుకు ఇతరుల వద్ద అప్పులు చేశాడు. వ్యాన్‌ కుదువ పెట్టి రూ.3లక్షలు అప్పులు చేశాడు. అయినా అప్పులు తీరకపోవడం, వ్యాన్‌ లేకపోవడం, భార్య అనారోగ్యానికి గురై పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్తాపం చెందాడు. ఆదివారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడికి భార్య వనిత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.

మద్యానికి బానిసై వృద్ధుడు..

లక్సెట్టిపేట: పట్టణంలోని బోయవాడకు చెందిన లింగయ్య(67) ఆత్మహత్య చేసుకున్నాడు. ఏఎస్సై అన్వర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. లింగయ్యకు ఆరుగురు అన్మదమ్ములు ఉండేవారు. గతంలో ఇద్దరు చనిపోగా ఇటీవల మరో ఇద్దరు మృతిచెందారు. దీంతో మద్యానికి బానిసయ్యాడు. తాగిన మైకంలో తాను కూడా చనిపోతే బాగుండు అని అంటూ ఉండేవాడు. ఆదివారం సాయంత్రం మద్యంమత్తులో గోదావరి రోడ్‌లోని తన పొలం వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు. మృతుడి కుమారుడు లక్ష్మణ్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై పేర్కొన్నారు.

వృద్ధుడి ఆత్మహత్య

లక్సెట్టిపేట: మున్సిపాలిటీ పరిధిలోని గంపలపల్లి గ్రా మానికి చెందిన రాందేని మల్లేశం(73) ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక ఏఎస్సై అన్వర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మల్లేశం గత కొద్ది రోజులుగా మోకాళ్ల నొప్పులు, అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆసుపత్రులకు వెళ్లినా నయం కాకపోవడంతో మనస్తాపం చెంది ఆదివారం సాయంత్రం ఇంట్లోనే పురుగుల మందు తాగాడు. కుటుంబీకులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి.. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం చనిపోయాడు. మృతుడి భార్య గురులక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement