తాండూర్: తండ్రి చితికి నిప్పంటించి కొడుకులు లేరనే లోటును తీర్చింది. పుట్టెడు దుఃఖంలోనూ దహనసంస్కారాలు నిర్వహించింది. మండలంలోని బోయపల్లి గ్రామానికి చెందిన ఇప్ప కమలాకర్(40) ఆదివారం తీవ్ర అనారోగ్యంతో మృతిచెందాడు. ఆయన మొదటి భార్య శోభ కూడా మూడేళ్ల క్రితమే అనారోగ్యంతో చనిపోయింది. వీరికి కూతురు కీర్తన ఉంది. ఆ తర్వాత కమలాకర్ మరో వివాహం చేసుకున్నాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కమలాకర్ తుది శ్వాస విడిచాడు. సోమవారం కమలాకర్ స్థానికులు దహన సంస్కారాలు నిర్వహించారు. కుమారుడు లేకపోవడంతో కూతురు కీర్తన ఆ బాధ్యతను తీసుకొని తండ్రికి తలకొరివి పెట్టింది. కూతురే అన్నీ తానై అంతిమ సంస్కారాలు నిర్వహించడం అక్కడున్న వారిని కలిచివేసింది.


