ఉట్నూర్‌రూరల్: గ్రీవెన్స్‌లో ప్రజల నుంచి అందుతున్న దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించాలని ఐటీడీఏ పీవో మంద మకరందు అధికారులను ఆదేశించారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించి, సంబంధిత శాఖల అధికారులకు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉట్నూర్ మండలం సాలెవాడ గ్రామానికి చెందిన గ్రామస్తులు తమ గ్రామానికి అంగన్‌వాడీ మంజూరు చేయాలని, ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామానికి చెందిన మెస్రం చిత్రు తనకు భూ పట్టా ఇప్పించాలని, ఆసిఫాబాద్ మండలం మాణిక్‌గూడ గ్రామానికి చెందిన భీము తనకి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, జన్నారం మండలం కలమడుగు గ్రామానికి చెందిన శ్రవణ్ కుమార్ పీఈటీ ఉద్యోగం ఇప్పించాలని దరఖాస్తు ఇచ్చారు. వీరితో పాటు మరికొందరు తమ సమస్యలపై అర్జీలు అందజేశారు.
ఆధ్యాత్మిక మార్గంలో ఐటీడీఏ పీవో
నిత్యం బిజీగా ఉంటూ గిరిజన ప్రాంత అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో నిమగ్నమయ్యే ఐటీడీఏ పీవో మంద మకరందు ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దీక్ష స్వీకరించారు.


