ఉట్నూర్‌రూరల్: సమాజంలో ఏది తప్పు, ఏది ఒప్పు కొడుకుకు చెప్పి సన్మార్గంలో పెట్టాల్సిన తండ్రే, కొడుకును వెంట బెట్టుకుని బెదిరింపులు, వసూళ్లకు పాల్పడిన ఘటన ఉట్నూర్ పట్టణంలో వెలుగుచూసింది. సీఐ ఎం.ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని పాత ఉట్నూర్‌కు చెందిన నేతావత్ రాందాస్, నేతావత్ జైల్‌సింగ్ అనే తండ్రీకొడుకులు గత కొద్ది రోజులుగా ఉట్నూర్ ప్రభుత్వ గిరిజన బాలుర కళాశాల హాస్టల్ వార్డెన్‌కు ఫోన్ కాల్స్ చేసి ఒక కార్యక్రమం పేరుతో డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. ఈ నెల 26న హాస్టల్‌కు వెళ్లిన నిందితులు రూ.5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవ్వకపోతే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించి జైలుకు పంపిస్తామని బెదిరించారు. గత ఆరు నెలల్లో రెండు సార్లు రూ.3వేల చొప్పున రూ.6వేలు వసూలు చేశారు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా నిందితుల ప్రమేయం నిర్ధారణ కావడంతో వారిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ పేర్కొన్నారు. బెదిరింపులు, బలవంతపు వసూళ్ల వంటి నేరాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట ఎస్సై విజయ్, పోలీసు సిబ్బంది ఉన్నారు.


