మావల మండల కేంద్రంలోని డాక్టర్ ఎస్.పవార్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సైన్సెస్ కళాశాల యాజమాన్యం విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తోంది. కోర్సులు పూర్తయిన తర్వాత కూడా వారికి ఒరిజినల్ సర్టిఫికెట్లు తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తోంది. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు నివేదిక ఇవ్వకముందే ఎలాంటి లోటుపాట్లు లేవంటూ కళాశాల యాజమాన్యం ప్రచారం చేసుకుంటూ విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తోంది. దీనిపై సమగ్ర విచారణ జరిపించి కళాశాల యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలి. – ఏబీవీపీ నాయకులు, ఆదిలాబాద్


