కజ్జర్ల గ్రామంలోని ప్రాఽథమిక పాఠశాలలో 56 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ ఏడాది దుబ్బగూడ, బట్టిసావర్‌గాం గ్రామాల నుంచి కూ డా పిల్లలను చేర్పించాం. ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు సైతం ఇక్కడికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే సర్దుబాటులో భాగంగా ఒక ఉపాధ్యాయడిని మరో పాఠశాలకు పంపించారు. దీంతో తమ పిల్లలకు అన్యాయం జరుగుతుంది. కలెక్టర్ స్పందించి ఉపాధ్యాయుడిని ఇక్కడే కొనసాగిస్తూ నాణ్యమైన విద్యనందించేలా చూడాలి.
– విద్యార్థుల తల్లిదండ్రులు, కజ్జర్ల, తలమడుగు


