సమస్యలు పరిష్కరించి భరోసా కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించి భరోసా కల్పించాలి

Jul 27 2026 11:55 PM | Updated on Jul 27 2026 11:55 PM

● అధికారులను ఆదేశించిన కలెక్టర్‌ రాజర్షిషా ● ప్రజావాణికి 97 దరఖాస్తులు

కైలాస్‌నగర్‌: ప్రజావాణిలో అందించే అర్జీలను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు భరోసా కల్పించాలని కలెక్టర్‌ రాజర్షి షా అధికారులను ఆదేఽశించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అడిషనల్‌ కలెక్టర్లు రాజేశ్వర్‌, చిత్రూలతో కలిసి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలువురు తహసీల్దార్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా బాధితుల సమస్యలు వివరించి వాటిని పరిష్కరించేలా చూడాలని ఆదేఽశించారు. అందుబాటులో ఉన్న జిల్లా అధికారులకు దరఖాస్తులను అందజేస్తూ వాటిని ప్రాధాన్యతతో పరిష్కరించాలని సూచించారు. 30 రోజుల్లోగా సమస్యలు పరిష్కరించి వాటి ప్రగతిని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, భూ భారతి, ఉపాధిహామీ వంటి వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం 97 అర్జీలు అందాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement