బోథ్: నియోజకవర్గంలోని ఆసుపత్రులను వెంటనే అభివృద్ధి పరిచి, గిరిజన, పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం హైదరాబాద్‌లో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆయన, నియోజకవర్గంలో ఎదురవుతున్న వైద్యారోగ్య శాఖకు సంబంధించిన పరిస్థితులను, ఆసుపత్రుల అభివృద్ధి ఆవశ్యకతను మంత్రికి వివరించారు. బోథ్ ఏరియా ఆసుపత్రిని అందుబాటులోకి తేవడంతో పాటు ఇచ్చోడ, నేరడిగొండ ప్రాంతాల్లోని పీహెచ్‌సీలను ఆధునీకరించాలని పేర్కొన్నారు. జాతీయ రహదారి ప్రమాదాల్లో బాధితుల ప్రాణాలు కాపాడేందుకు అత్యవసర వైద్య వసతులు కల్పించాలని, కిడ్నీ బాధితుల కోసం డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, నూతనంగా నిర్మించిన 100 పడకల ఏరియా ఆసుపత్రిలో సిబ్బందిని నియమించాలని, నేరడిగొండ ఆసుపత్రిలో రూ. 6 కోట్ల అంచనా వ్యయంతో 30 పడకల ఇన్–పేషెంట్ భవ నం, లేబర్ రూమ్, నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని మంజూరు చేయాలని కోరారు.


