ఆదిలాబాద్‌టౌన్: బహిరంగంగా మద్యం సే విస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆ దిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం డీఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ, ప్రై వేట్ పాఠశాలలు, కళాశాలలు, వాటి మైదా నాలు, ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ స్థలాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆదివా రం రాత్రి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బ్రా హ్మణవాడ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మ ద్యం సేవిస్తున్న జుబేర్‌ను అదుపులోకి తీసుకు ని క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు వివరించా రు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడాన్ని పూర్తిగా అరికట్టేందుకు ఆదిలాబాద్ సబ్‌డివిజ న్ పరిధిలో ప్రత్యేక గస్తీ బృందాలు నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తున్నాయని తెలిపా రు. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారి గురించి సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు.


