ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ విమానాశ్రయ ఏర్పాటులో భాగంగా భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం నిధుల కేటాయింపును స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి జోగు రామన్న ప్రకటనలో పేర్కొన్నారు. కొ రటా–చనాఖా బ్యారేజ్ 90 శాతం పూర్తయ్యిందని తెలిపారు. మిగతానిధులు సైతం కేటాయిస్తే 50వేల ఎకరాల సాగునీరు అందుతుందని దీంతో రైతులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. సీసీఐ విషయంలో కేంద్రం సానుకూలంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం రూ.250 కోట్ల నిధులు కేటాయిస్తే పునఃప్రారంభించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు ఈ విషయంలో చొరవ చూపాలని పేర్కొన్నారు. ఇండస్ట్రీయల్ క్యారిడార్‌తో పాటు విమానాశ్రయం, సీసీఐని పునఃప్రారంభిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
సంపాదిత సెలవులు
మంజూరు చేయాలి
ఆదిలాబాద్‌టౌన్: జనగణన కార్యక్రమంలో ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లుగా విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు సంపాదిత సెలవులు మంజూరు చేయాలని టీయూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సాయిరి శ్రీకాంత్, ఎం. జలంధర్‌రెడ్డి కోరారు. ఈమేరకు డీఈవో మాధవికి ఆదివారం వినతిపత్రం అందజేశారు. జిల్లాలోని అన్ని మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులకు తక్షణమే ఆదేశాలు జారీ చేసి అర్హులైన వారికి సంపాదిత సెలవులు మంజూరు చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన డీఈవో అర్హులైన ఉపాధ్యాయులకు న్యాయం జరిగేలా ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులకు ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చినట్లు వివరించారు.


