సాక్షి,ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికకు రంగం సిద్ధమైందా.. అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఈమేరకు ఎవరి బలం ఎంతో త్వరలోనే తేలనున్నట్లు తెలుస్తోంది. కోఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహించాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ చైర్‌పర్సన్ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని ప్రతిపక్ష సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో గత సర్వసభ్య సమావేశంలో ఎజెండా అంశాలను ఆమోదించబోమంటూ బీజేపీ కౌన్సిలర్లతో పాటు బీఆర్‌ఎస్, స్వతంత్ర సభ్యులు కూడా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ప్రజా సంక్షేమానికి సంబంధించిన ఎజెండా అంశాలను కోఆప్షన్ ఎన్నికలకు ముడిపెట్టడం సరికాదని చైర్‌పర్సన్ వర్గం వాదిస్తోంది. అత్యవసర ప్రజాపనులకు ఆమోదం పొందేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో కలెక్టర్‌ను ఆశ్రయించామని కలెక్టర్‌కు ఉన్న ప్రత్యేక అధికారా ల ద్వారా ఎజెండా అంశాలకు ఆమో దం పొందినట్లు ఆ వర్గం చెబుతోంది. మరో వైపు ప్రతిపక్ష సభ్యులు కోఆప్షన్ ఎన్నికను నిర్వహించకపోవడంపై అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. ఈ పరి ణామాలు బట్టి చూస్తే మున్సిపల్ రాజకీయాల్లో ప్రస్తుతం నెలకొన్న వివాదాలన్నీ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక చుట్టూనే తిరుగుతున్నట్లు స్పష్టమవుతోంది.
ఎవరిది పైచేయి..?
గత జూన్ 29న మున్సిపల్ సర్వసభ్య సమావేశం జరిగిన విషయంతెలిసిందే.అందులో బీజేపీ, బీఆర్ ఎస్, స్వతంత్ర కౌన్సిలర్లు కోఆప్షన్ ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఎజెండా అంశాల ను బహిష్కరించారు. కాంగ్రెస్‌తో కలిసి పాలకపక్షంలో ఉన్న బీఆర్‌ఎస్‌కు చెందిన కొందరు సభ్యులు, ఒకరిద్దరు స్వతంత్ర కౌన్సిలర్లు కూడా ఆ వైఖరికి మద్దతు ఇ వ్వడంకాంగ్రెస్‌పాలకవర్గానికి ఇబ్బందికరంగా మా రింది. ఆ రోజు ఎజెండా అంశాలను బహిష్కరించడం ద్వారా తామే పైచేయి సాధించామని కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తున్న మెజార్టీ కౌన్సిలర్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు సభ్యులు వ్యతిరేకించినప్పటికీ కలెక్టర్‌కు ఉన్న ప్రత్యేక అధికారాల ద్వారా కీలక ఎజెండా అంశాల కు ఆమోదం పొందామని, అందువల్ల తమదే విజయమని చైర్‌పర్సన్ వర్గం చెబుతోంది.అయితే కలెక్టర్ అన్ని ఎజెండా అంశాల ను కాకుండా కొన్నింటికే ఆమోదం తెలిపారని, మ రికొన్ని పనుల బడ్జెట్‌ను కూడా తగ్గించారని పే ర్కొంటూ ఇది కాంగ్రెస్ పాలకవర్గం వైఫల్యమేనని మెజార్టీ కౌన్సిలర్లు చురకలు అంటిస్తున్నారు. మరో వైపు తాము తెరచాటు రాజకీయాలకు పాల్పడబోమని, అదే సమావేశంలో అప్రజాస్వామికంగా వ్యవహరించిన కౌన్సిలర్లపై చర్యలు తీసుకుని సస్పెండ్ చేసి ఉంటే కోఆప్షన్ ఎన్నికలో తమకు అనుకూల పరిస్థితులు ఏర్పడేవని చైర్‌పర్సన్ వర్గం పేర్కొంటోంది. అయినప్పటికీ ప్రజా సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని, అత్యవసర ప్రజాపనులు నిలిచిపోకుండా కలెక్టర్ ప్రత్యేక అధికారాలతో ఆమో దం తెలిపారని కాంగ్రెస్ వర్గం వివరిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో మున్సిపల్ రాజకీయాల్లో అసలు పైచేయి ఎవరిది అన్న అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఎన్నికకు సిద్ధం
తాజా పరిస్థితుల్లో కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు కాంగ్రెస్ పాలకవర్గం సిద్ధమవుతోంది. హైకోర్టు 28 రో జుల్లోగా నిర్వహించాలని ఆదేశించడంతో ఆ దిశగా అడుగులు వేస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున వార్డులో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థిని తమవైపు తిప్పుకుని బీజేపీ కుటిల రాజకీయాలకు పాల్పడుతోందని తద్వారా పాలకవర్గంఏర్పాటులో తమకు మద్దతుగా నిలిచిన సభ్యులబలంతో కోఆప్ష న్ సభ్యుడిని గెలిపించుకోవాలని చూస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.మొత్తంగాకోఆప్షన్‌ఎన్నిక చుట్టూ నే మున్సిపల్ రాజకీయాలు కొనసాగుతున్నాయి.


