ఎఫ్‌ఎల్‌ఎన్‌ రాష్ట్ర బృందం పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ఎఫ్‌ఎల్‌ఎన్‌ రాష్ట్ర బృందం పరిశీలన

Jul 26 2026 1:56 AM | Updated on Jul 26 2026 1:56 AM

ఆదిలాబాద్‌టౌన్‌: ఎఫ్‌ఎల్‌ఎన్‌ (ఫౌండేషనల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ) రాష్ట్ర బృందం స భ్యులు శనివారం జిల్లాలో విద్యా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. డీఈవో మాధవి, ఏఎంవో లక్ష్మణ్‌తో పాటు సెక్టోరియల్‌ అధికారులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, హాజరు శాతం, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రజల భాగస్వామ్యం తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అభ్యసన సామర్థ్యాలను మరింత మెరుగుపర్చేందుకు రాబో యే రోజుల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. అలాగే ఉపాధ్యాయులకు అందిస్తున్న శిక్షణ, బోధన తీరుపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్‌ రాజర్షి షాను కలిసి జిల్లాలో విద్యారంగానికి సంబంధించిన అంశాలపై చ ర్చించారు. ఈ బృందంలో నిఖిలేష్‌, రాజశేఖర్‌, గీత, శ్యామ్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement