తొలిఏకాదశి వేడుకలను జిల్లావాసులు శనివారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. వేకువజాము నుంచే భక్తులు వైష్ణవ ఆలయాల బాటపట్టారు. శ్రీ మహావిష్ణువు దర్శ నం కోసం గంటల తరబడి బారులు తీరి ప్రత్యేక పూజ లు నిర్వహించారు. ఓం నమో నారాయణాయ నామస్మరణ మారుమోగింది. జిల్లా కేంద్రంలోని శ్రీ మార్వాడి ధర్మశాల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం, శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠం, శ్రీరమాసత్యనారాయణస్వామి ఆల యం, రాంనగర్ కాలనీలోని శ్రీవిఠలేశ్వర–రుక్మాబాయి ఆలయాల్లో రద్దీ కనిపించింది. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీలు,దేవాదాయ శాఖ అధికా రులు ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. – ఆదిలాబాద్


