ఆదిలాబాద్‌టౌన్: చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగా హన అవసరమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె. ప్రభాకరరావు అన్నారు. శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో జిల్లా న్యాయ సేవాసంస్థ ఆధ్వర్యంలో చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు బాధ్యతలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల భ ద్రత, బాలల హక్కులు, పోక్సో చట్టం, సైబర్ భద్ర త, మంచి–చెడు స్పర్శ, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలపై వచ్చే ఏడాది మే వరకు ప్రతి నెల ప్ర త్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్న ట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మౌనిక, డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి రాజ్యలక్ష్మి, డీఈవో మాధవి, బాలల సంరక్షణ అధికారి రాజేంద్ర ప్రసా ద్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, న్యా యవాదులు, బాలల రక్షణ అధికారులు పాల్గొన్నారు.
నైపుణ్యాలు పెంపొందించుకోవాలి
న్యాయశాఖ ఉద్యోగులు నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకుంటూ కోర్టు విధుల్లో సమర్థతను చాటాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకరరా వు సూచించారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలో తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ ఆధ్వర్యంలో న్యాయశాఖ ఉద్యోగులకు విధుల నిర్వహణపై శిక్షణ నిర్వహించారు. పలు అంశాలపై రిసోర్స్ ప ర్సన్లు ఉద్యోగులకు అవగాహన కల్పించారు.


