‘జలసిరి’ పకడ్బందీగా అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

‘జలసిరి’ పకడ్బందీగా అమలు చేయాలి

Jul 26 2026 1:56 AM | Updated on Jul 26 2026 1:56 AM

● మంత్రి సీతక్క

ఆదిలాబాద్‌: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. శనివారం సెర్ప్‌ సీఈవో, పంచాయతీరాజ్‌ –గ్రామీ ణాభివృద్ధి శాఖ కమిషనర్‌ దివ్య దేవరాజన్‌తో కలిసి అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరె న్స్‌ నిర్వహించారు. జలసిరి, వీబీజీ–ఆర్‌ఎంజీఎస్‌ పనులను సమీక్షించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ రాజేశ్వర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి పంటకు పంటకుంట, ప్రతి ఊరికి ఊట కుంట లక్ష్యంగా నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి రైతు ఫామ్‌ పాండ్‌ నిర్మించుకునేలా ప్రోత్సహించాలని, రెయిన్‌వాటర్‌ హార్వెస్టింగ్‌ ద్వారా భూగర్భ జలాల మట్టాన్ని పెంచాలని తెలిపారు. సమావేశంలో జెడ్పీ సీఈవో రవి, డీఆర్డీవో రవీందర్‌, డీపీవో రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement