తలమడుగు: బోథ్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మండలంలోని సుంకిడి గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన మహిళా సంఘ భవనాన్ని శనివారం ప్రారంభించారు. 20 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం కుచులాపూర్‌లో మహిళా సంఘ భవనానికి భూమి పూజ చేశారు. మీసేవ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ, నియోజకవర్గంలోని ఆ యా గ్రామాల్లో సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, తహసీల్దార్ రాజ్‌మోహన్, ఎంపీడీవో శంకర్, సర్పంచ్‌లు మగ్గిడి నర్సమ్మ ప్రకాశ్, వెంకన్న, బీఆర్‌ఎస్ మండల కన్వీనర్ వెంకటేశ్, నాయకులు కిరణ్ కుమార్, కేదారేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, అభిరామిరెడ్డి, అబ్దు ల్లా, ప్రకాశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


