కో–ఆప్షన్ సభ్యుల ఎన్నికకు సంబంధించిన తేదీని ఈనెల 27న (సోమవారం)ప్రకటిస్తాం. ఎన్నికకు మేము సిద్ధంగానే ఉన్నాం. హైకోర్టు ఆదేశాలను పాటిస్తూ ముందుకు వెళ్తున్నాం. బీజేపీ దొంగ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు.
– బండారి అనూష, మున్సిపల్ చైర్‌పర్సన్
ఇది చైర్‌పర్సన్ వైఫల్యం
కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు ఈ పాలకవర్గం ముందుకు రాలేదు. ప్రత్యేక అధికారాలతో ఎజెండా అంశాలను ఆమోదించుకున్నామని కాంగ్రెస్ చైర్‌పర్సన్ చెబుతున్నా, ఆ తీరు సబబు కాదు. కొన్ని ఎజెండా అంశాలకు కలెక్టర్ ఆమోదం ఇవ్వలేదు. మరికొన్నింటికి బడ్జెట్ తగ్గించారు. ఇది చైర్‌పర్సన్ వైఫల్యానికే నిదర్శనం.
– కలాల శ్రీనివాస్,
విద్యానగర్ స్వతంత్ర కౌన్సిలర్


