ఆదిలాబాద్‌టౌన్: కేంద్ర ప్రభుత్వం వరుసగా తప్పులు చేస్తూ, అనంతరం వాటికి మూల్యం చెల్లించుకోవడం పరిపాటిగా మారిందని మా జీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. జిల్లా కేంద్రంలో శనివారం ఆయన మాట్లాడారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సి రావడం విద్యార్థుల పోరాట విజయానికి నిదర్శనమని అన్నారు. యువత ఐక్యంగా పోరా డితే ఏ ప్రభుత్వమైనా ప్రజల అభిప్రాయానికి తలొగ్గాల్సిందేనని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తి తో ఆదిలాబాద్ సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభం కోసం సీసీఐ సాధన సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసి, పరిశ్రమ పునఃప్రారంభమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.


