విద్యాసంస్థల బంద్‌ విజయవంతం | - | Sakshi
Sakshi News home page

విద్యాసంస్థల బంద్‌ విజయవంతం

Jul 25 2026 1:59 AM | Updated on Jul 25 2026 1:59 AM

ఆదిలాబాద్‌టౌన్‌: నీట్‌పేపర్‌ లీకేజీ ఘటనతో పాటు ఢిల్లీలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన వి ద్యార్థులపై లాఠీచార్జిని నిరసిస్తూ వామపక్ష వి ద్యార్థి సంఘాలు శుక్రవారం దేశ వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునివ్వగా జిల్లాలో విజయవంతమైంది. ఏఐవైఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మెస్రం భాస్కర్‌ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసిన నీట్‌ పేపర్‌ లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. అనంత రం కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలిపారు. ఇందులో ఎన్‌ఎస్‌యూఐ, యూఎస్‌ఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐ ఎస్‌ఎఫ్‌, పీడీఎస్‌యూ, బీఆర్‌ఎస్వీ, ఏఐవైఎఫ్‌, ఏఐ ఎస్‌ఎఫ్‌ నాయకులు గెడం కేశవ్‌, తోట కపిల్‌, నగేష్‌, అశోక్‌,సాయికుమార్‌, ఇషాంత్‌, భాస్కర్‌, వరుణ్‌, శివకుమార్‌, తదితరులున్నారు.

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలి

నీట్‌ పేపర్‌ లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెంటనే రాజీనామా చేయాలని అఖిలపక్ష రైతు సంఘాల జిల్లా అధ్యక్షుడు బండి దత్తాత్రి డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని బాసెట్టి మాధవరావు విజ్ఞాన కేంద్రం ఎదుట శుక్రవారం నిరసన చేపట్టారు. ఇందు లో నాయకులు పోశెట్టి, దేవిదాస్‌, వెంకటనారాయ ణ, జగన్‌సింగ్‌, లక్ష్మణ్‌, ఆశన్న, పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement