ఆదిలాబాద్‌టౌన్: సీసీఐ పునఃప్రారంభం కోసం సా ధన సమితి చేపట్టనున్న భవిష్యత్ కార్యాచరణలో బీఆర్‌ఎస్ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం మాట్లాడుతూ, సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభంపై స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు చిత్తశుద్ధితో కృషి చేయడం లేదని విమర్శించారు. పరిశ్రమను వంద శాతం తిరిగి ప్రారంభించే అవకాశం ఉందని, ఈ విషయమై ఢిల్లీలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రిని కలిసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.250 కోట్లతో పాటు అవసరమైన రాయితీలు కల్పిస్తే పరిశ్రమను తిరిగి నడిపేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.


