ఆదిలాబాద్‌టౌన్: ప్రభుత్వం పెండింగ్ బకా యిలు వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి కేశవ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్నేళ్లుగా స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్‌లో ఉండడంతో పేద విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ యా జమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయన్నారు. కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని, ఎంఈఓ, ఉపాధ్యాయ, లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.


