రేపు విద్యాసంస్థల బంద్‌ | - | Sakshi
Sakshi News home page

రేపు విద్యాసంస్థల బంద్‌

Jul 23 2026 1:48 AM | Updated on Jul 23 2026 1:48 AM

ఆదిలాబాద్‌టౌన్‌: ఈ నెల 24న విద్యాసంస్థల బంద్‌ చేపట్టనున్నట్లు యూఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్‌ అల్తాఫ్‌, ఆత్రం నాగేష్‌ తెలిపారు. జిల్లా కేంద్రంలో బుధవారం ఆయన మాట్లాడారు. ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, యువతపై బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే లాఠీచార్జి చేయించిందని ఆరోపించారు. ఈ ఘటనను అన్నివర్గాల ప్రజలు ఖండించాలని కోరారు. మోడీ సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే కేంద్ర విద్యాశాఖ మంత్రిని తక్షణమే మంత్రివర్గం నుంచి భర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ)ను రద్దు చేయాలని పేర్కొన్నారు. నీట్‌పేపర్‌ లీకేజీపై 30 రోజులుగా విద్యార్థులు దీక్షలు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. కేంద్రప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ చేపట్టిన విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థులు, తల్లిదండ్రులు, యాజమాన్యాలు మద్దతు తెలిపి విజయవంతం చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement