ఆదిలాబాద్‌టౌన్: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్‌ఆర్ ఫౌండేషన్, భీమ్ ఆర్మీ ఆజాద్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్ ఫౌండేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ ఆసిఫ్, షేక్ అస్లమ్, భీమ్ ఆర్మీ ఆజాద్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ షకీల్ మాట్లాడారు. నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


