నమ్మించి.. దోచేస్తారు | - | Sakshi
Sakshi News home page

నమ్మించి.. దోచేస్తారు

Jul 23 2026 1:48 AM | Updated on Jul 23 2026 1:48 AM

● హార్డ్‌వేర్‌ షాప్‌ యజమాని స్కూటీ ఎత్తుకెళ్లిన దుండగుడు

● హార్డ్‌వేర్‌ షాప్‌ యజమాని స్కూటీ ఎత్తుకెళ్లిన దుండగుడు

ఆదిలాబాద్‌టౌన్‌: దుండగులు రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్నారు. బిజినెస్‌ మ్యాన్‌లా రెడీ అయ్యి.. చేతిలో బ్యాగుతో అందరూ నమ్మేలా షాపులకు వెళ్తారు.. షాపు యజమానిని బురిడి కొట్టించి దోపిడీకి పాల్పడతారు. ఇలాంటి సంఘటనే జిల్లా కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. ఆదిలాబాద్‌ పట్టణంలోని భుక్తాపూర్‌ కాలనీలో గల కె.శివం హార్డ్‌వేర్‌ దుకాణానికి ఉదయం 11 గంటలకు ఫెవికిక్‌, మొలలు, స్కృలు, ఇతర సామాగ్రి కొనుగోలు చేశాడు. వాటికి సంబంధించి జీఎస్టీ బిల్లు కావాలని షాపు యజమాని ప్రవీణ్‌కు చెప్పాడు. దీంతో ఆయన జీఎస్టీ నంబర్‌ చెప్పాలని అడగడంతో తన వద్ద నంబర్‌ లేదని, ఇప్పుడే తెలుసుకొని వస్తానని, తన బ్యాగ్‌ అప్పటివరకు ఇక్కడే ఉంచాలని చెప్పి ఆ షాపు యజమాని స్కూటీని తీసుకెళ్లాడు. తిరిగి రాకపోవడంతో వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. డీఎస్పీ ఎల్‌.జీవన్‌రెడ్డి, సీఐ సునీల్‌కుమార్‌, ఎస్సై అశోక్‌ ఘటన స్థలానికి చేరుకొని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. డీఎస్పీ మాట్లాడుతూ నిందితుడు ఇచ్చోడ నుంచి ఓ ఆటోలో ఆదిలాబాద్‌కు వచ్చినట్లు తెలిపారు. స్కూటీతో పాటు ఆటో డ్రైవర్‌ ఫోన్‌ను సైతం ఎత్తుకెళ్లాడని వివరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement