నిర్మల్‌టౌన్‌న్: జిల్లా కేంద్రంలోని వెంకటాపూర్ కాలనీలో బుధవారం వేకువ జామున దొంగలు మూడిళ్లలో చోరీకి పాల్పడ్డారు. పట్టణంలోని వెంకటాపూర్ కాలనీకి చెందిన లింగన్న ఇంట్లో 4 తులాల బంగారం, రూ.40 వేల నగదు, సునీత ఇంట్లో 6 గ్రాముల బంగారం, 10 తులాల వెండి, లక్ష్మి ఇంట్లో 7 గ్రాముల బంగారం, 8 తులాల వెండి, రూ.4 వేల నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. సోఫీనగర్ కాలనీలో బైక్‌ను అపహరించినట్లు సమాచారం. పోలీసులకు సమాచారం అందించడంతో డీఎస్పీ శ్రీనివాస్, పట్టణ సీఐ సమ్మయ్య సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం సిబ్బందిని రప్పించి వేలిముద్రలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.


