బాసర: రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో బుధవారం వైదిక సంప్రదాయం ప్రకారం వరుణ యాగం ఘనంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల మధ్య గణపతి పూజతో మొదలై వరుణ జపం, హోదాది క్రతువులు, పూర్ణాహుతి, మహాశీర్వచనంతో యాగం శాస్త్రోక్తంగా కొనసాగింది. ఆలయ ఈవో అంజనిదేవి, ఏఈవో గంగ శ్రీనివాస్, స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్, ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి, అర్చకులు శృతి మురళిశర్మ, అంకుష్శర్మ, నవీన్శర్మ, వేద పండితులు గోవింద్ శర్మ, కిషోర్ పాఠక్, శ్రీనివాస్ శర్మ, కళాధర్ శర్మ పాల్గొన్నారు.


