బెల్లంపల్లి/భీమిని: అడవి పందిని హతమార్చిన 32 మందిపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేసినట్లు బెల్లంపల్లి అటవీరేంజ్ అధికారి(ఎఫ్‌ఆర్‌ఓ) పూర్ణచందర్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు ఈనెల 20న భీమిని మండలంలోని ఖర్జీ భీంపూర్‌లో డీఆర్‌వో గౌరి శంకర్, టి.గోపికృష్ణ, ఫారెస్టు బీట్ అధికారి గ్రామానికి వెళ్లి నగేష్ ఇంట్లో సోదా చేసినట్లు విచారించారు. కుక్కలు హతమార్చిన అడవిపంది మాంసాన్ని నగేష్‌తో పాటు గ్రామంలోని మరో 8 మంది, నార్లపూర్‌కు చెందిన 14 మంది, రాజారాంకు చెందిన ఆరుగురు, పైకాజీగూడకు చెందిన ముగ్గురు పోగులు వేసుకున్నారు. బుధవారం 32 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


