దూరవిద్య.. చదువుకు దగ్గర..! | - | Sakshi
Sakshi News home page

దూరవిద్య.. చదువుకు దగ్గర..!

Jul 23 2026 1:48 AM | Updated on Jul 23 2026 1:48 AM

ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌లో ప్రవేశాలు ఇంటి వద్దనుంచే చదువుకునే వారికి చక్కటి అవకాశం 2026–27లో ప్రవేశాలకు వెలువడిన ప్రకటన దరఖాస్తుకు తుది గడువు జూలై 28

విద్యార్థులు

ఆదిలాబాద్‌ 46 23 42 111

మంచిర్యాల 32 25 74 131

నిర్మల్‌ 36 03 19 58

ఆసిఫాబాద్‌ 30 04 16 50

మంచిర్యాలఅర్బన్‌: కుటుంబ ఆర్థిక పరిస్థితులు, వ్యక్తిగత, ఇతర కారణాల వలన చదువు మధ్యలో మానేసిన వారిలో ఓపెన్‌ స్కూల్‌ విధానం కొత్త ఆశలు నింపుతోంది. చదువుకోవాలనే ఆసక్తి ఉన్న ఏవయస్సు వారైనా మళ్లీ విద్యను కొనసాగించేందుకు గరిష్ట వయోపరిమితి లేకుండా ప్రోత్సహిస్తోంది. రెగ్యులర్‌గా తరగతులకు హాజరు కావాల్సిన అవసరం లేకుండా స్వీయ అధ్యయనం, అనుకూలమైన సమయంలో పరీక్షలు రాసే వెసులుబాటు కల్పిస్తోంది. వారి భవిష్యత్‌కు బాటలు వేస్తోంది.

ప్రవేశాలు ఇలా..

ప్రభుత్వం సార్వత్రిక విద్యను 2008–2009 విద్యాసంవత్సరంలో అందుబాటులోకి తెచ్చింది. ఎలాంటి విద్యార్హత లేనివారికోసం ముందుగా పదోతరగతి చదివేందుకు అవకాశం కల్పించింది. ప్రవేశాలకు స్పందన, అభ్యాసకులకు మరింత ప్రయోజనం కలిగేలా 2010–2011 విద్యాసంవత్సరంలో ఇంటర్‌ విద్యను అమల్లోకి తీసుకువచ్చింది. ఎంపిక చేసిన మండలాల్లోని ఉన్నత పాఠశాలల్లో అధ్యయన కేంద్రాలు ఏర్పాటు చేసి నిర్వహణ బాధ్యతలు మండల సమన్వయకర్తలకు అప్పగించింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మొత్తం ఓపెన్‌ స్కూల్‌ అధ్యయన కేంద్రాలు పదోతరగతి–87, ఇంటర్‌–97 ఉన్నాయి. ఇందులో ఆదిలాబాద్‌లో పదో తరగతికి 28, ఇంటర్‌కు 31, కుమురంభీం ఆసిఫాబాద్‌లో పదోతరగతి–18, ఇంటర్‌–19, మంచిర్యాలలో పదోతరగతి–16, ఇంటర్‌–21 నిర్మల్‌లో పదో తరగతి–25 ఇంటర్‌ టాస్‌ 26 కేంద్రాలున్నాయి. గతేడాది 7,080 మందిని ఎన్‌రోల్‌ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా 7,156 మంది విద్యార్థులు పేర్లు నమోదు చేసుకుని 6,965 మంది ప్రవేశ రుసుము చెల్లించారు. 2026–27 విద్యా సంవత్సరానికి జూలై 1 నుంచి ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. జూలై 22 వరకు 350 మంది విద్యార్థులు పేర్లు నమోదు చేసుకోగా 269 మంది ఫీజు చెల్లించారు.

దరఖాస్తులు ఇలా..

ఓపెన్‌ స్కూల్‌లో చేరాలనుకునే వారు స్థానిక పాఠశాలలో సంప్రదించి మీసేవ, ఇతర కేంద్రాల్లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. www. telangana openschool. org ద్వారా డెబిట్‌, క్రెడిట్‌ ద్వారా, నెట్‌ బ్యాంకింగ్‌ ఉపయోగించి ఫీజు చెల్లించవచ్చు. అపరాధ రుసుం లేకుండా జూలై 28 వరకు, అపరాధ రుసుంతో ఆగస్టు 29 వరకు గడువు విధించారు. పదోతరగతి జనరల్‌, బీసీ (పురుషులు) రూ.1400, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పురుషులు, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగుల పిల్లలు, మహిళలకు రూ.1000, రిజస్ట్రేషన్‌ ఫీజు రూ. 150 (అందరికీ) చెల్లించాలి. ఇంటర్‌కు జనరల్‌, ఓసీ (పురుషులు) రూ.1500, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పురుషులు, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగుల పిల్లలు, మహిళలకు రూ.1200 రిజిస్ట్రేషన్‌ ఫీజు, రూ.300 ఆన్‌లైన్‌ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

బోధన ఇలా..

ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌లో ప్రవేశం పొందిన వారికి ప్రభుత్వ పాఠశాలలో సెలవు రోజుల్లో తరగతులు కొనసాగుతాయి. ఏదైనా పాఠశాల, కళాశాలలో 20 కు పైగా ఆడ్మిషన్లు ఉన్నట్లయితే వారికి ప్రతీ ఆది వారం, రెండో శనివారం, ఇతర సెలవు దినంలో తరగతులు నిర్వహిస్తారు. 20 కంటే తక్కువగా ఉంటే సమీపంలోని పాఠశాల, కళాశాలల్లో తరగతులు నిర్వహిస్తారు. ఉచిత పాఠ్యపుస్తకాలతో పాటు అధ్యయన సామగ్రి పంపిణీ చేస్తారు. తెలుగు, హిందీ, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో బోధన ఉంటుంది.

జూలై 22 వరకు ఉమ్మడి జిల్లా వారీగా ప్రవేశాలు

జిల్లా టెన్త్‌ ఇంటర్‌ సైన్స్‌ నాన్‌సైన్స్‌ మొత్తం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement