తాండూర్: పాము కాటు కు గురైన మండలంలోని కిష్టంపేటకు చెందిన రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీ డాకారుడు బండి సాగర్ (30) హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. వారం రోజుల క్రితం సాగర్ పాము కాటుకు గురికావడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతునికి భార్య సాయిశ్రీ, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.
రైలు నుంచి కిందపడి వ్యక్తి మృతి
మందమర్రిరూరల్: మందమర్రి రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం రైలులో నుంచి కిందపడి బిహార్‌కు చెందిన మణిభూషన్‌కుమార్ (22) మృతి చెందినట్లు రైల్వేహెడ్ కానిస్టేబుల్ సంపత్ తెలిపారు. సాగర్ రైలులో కేరళకు వెళ్తున్న మణిభూషన్‌కుమార్ ప్రమాదవశాత్తు కిందపడిపోగా తీవ్రగాయాలు కా వడ ంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పే ర్కొన్నారు. మృతదేహాన్ని మంచిర్యాల ప్ర భుత్వ ఆసుపత్రిలో భద్రపరిచినట్లు తెలిపారు.
బైండోవర్ ఉల్లంఘించిన ఒకరికి జరిమానా
ఆదిలాబాద్‌టౌన్: బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించి మళ్లీ మట్కా నిర్వహిస్తూ పట్టుబడిన వ్యక్తికి రూ.15 వేల జరిమానా విధించినట్లు ఆదిలాబాద్ వన్‌టౌన్ సీఐ బి.సునీల్ కుమార్ తెలిపారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన రాయి సునీల్ కుమార్ గతంలో మట్కా కేసులో నిందితుడిగా ఉండటంతో బైండోవర్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి మళ్లీ అదే తరహా నేరానికి పాల్పడినట్లు గుర్తించి అతనిపై చర్యలు చేపట్టి, నివేదికను ఆదిలాబాద్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయానికి పంపించారు. విచారణ అనంతరం తహశీల్దార్ శ్రీనివాస్ నిందితుడికి రూ.15వేల జరిమానా విధించగా, ఆ మొత్తాన్ని చెల్లించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం సీఐ మాట్లాడుతూ బైండోవర్‌లో ఉన్న వ్యక్తులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, వాటిని ఉల్లంఘించి మళ్లీ నేరాలకు పాల్పడితే జైలుశిక్షతో పాటు భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించారు.


