రెబ్బెన: ఆసిఫాబాద్ రోడ్ నుంచి కాగజ్‌నగర్ మధ్య నిర్మితమైన మూడో రైల్వే లైన్‌ను మంగళవారం కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ మాధవి ఆసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషన్‌లో ప్రారంభించారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం లైన్‌ను ప్రారంభించి, మోటర్ ట్రాలీతో అధికారులతో కలిసి ట్రాక్ నిర్మాణ పనులు, నాణ్యతను పరిశీలించారు. పెద్దవాగుపై నిర్మించిన మూడో బ్రిడ్జి వద్ద ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. అక్కడి నుంచి ట్రాకును పరిశీలిస్తూ కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అనంతరం స్పెషల్ ట్రైన్‌తో 130 కిలోమీటర్ల వేగంతో కాగజ్‌నగర్ నుంచి ఆసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషన్ వరకు స్పీడ్ టెస్ట్ నిర్వహించారు. స్పీడ్ టెస్ట్ విజయవంతం కావడంతో రైల్వే అధికారులంతా సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమాల్లో డీఆర్‌ఎం గోపాలకృష్ణన్, ఇతర రైల్వే అధికారులు పాల్గొన్నారు.


