అత్యాచారయత్నం కేసులో జరిమానా | - | Sakshi
Sakshi News home page

అత్యాచారయత్నం కేసులో జరిమానా

Jul 20 2026 11:36 PM | Updated on Jul 20 2026 11:36 PM

ఆదిలాబాద్‌టౌన్‌: అత్యాచారయత్నం కేసులో నిందితుడికి రూ.20వేల జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి కె.ప్రభాకర్‌ రావు తీర్పునిచ్చినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. బోథ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి లోని సొనాల మండలం పునియా నాయక్‌ తండా కు చెందిన సోలంకి సుందర్‌ సింగ్‌ 2024లో బాధితురాలు కౌలుకు తీసుకున్న వ్యవసాయ పొలంలో పనిచేస్తున్న సమయంలో ఆమైపె అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అప్పటి బోథ్‌ ఎస్సై ప్రవీణ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కోర్టులో ఎనిమిది మంది సాక్షులను ప్రవేశపెట్టి పీపీ రహీం వాదనలు వినిపించగా నేరం రుజువైంది. ఈ మేర కు జడ్జి తీర్పునిచ్చినట్లు వివరించారు. కేసులో ప్రతి భ కనబర్చిన కోర్టు డ్యూటీ అధికారి, లైజన్‌ అధి కారులను ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అభినందించారు.

అదృశ్యమైన యువకుడి

అనుమానాస్పద మృతి

నర్సాపూర్‌(జి): ఇటీవల అదృశ్యమైన మండలంలోని రాంపూర్‌కు చెందిన యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంపూర్‌ గ్రామానికి చెందిన పంచగూడ సాయితేజ (26) అనే యువకుడు ఈనెల 16న ఉదయం నుంచి కనిపించడం లేదని యువకుడి తల్లి పంచగూడ ముత్తవ్వ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫోన్‌ సిగ్నల్‌, సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా ముప్కాల్‌ మండలం వేంపల్లి గ్రామ శివారులో గల కెనాల్‌ ఒడ్డుపై అనుమానాస్పదంగా మృతి చెంది ఉన్నట్లు సోమవారం గుర్తించారు. సంఘటన స్థలాన్ని నిర్మల్‌ రూరల్‌ సీఐ కృష్ణ, ఎస్సై గణేశ్‌, క్లూస్‌టీంలు పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్‌ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు.

యువరైతు ఆత్మహత్య

లక్ష్మణచాంద: క్షణికావేశానికి లోనై యువరైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని పార్‌పెల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం పార్‌పెల్లి గ్రామానికి చెందిన మెరుగు గణేశ్‌ (30) తన స్నేహితుడు అడెల్లి దేవస్థానం వద్ద పండుగ చేస్తున్నాడని ఇంట్లో చెప్పి వెళ్లాడు. తిరిగి సాయంత్రం 7.30 గంటలకు మద్యం తాగి ఇంటికి రాగా భార్య మౌనిక ఎందుకు ఇంతలా తాగి వచ్చావని అడిగింది. దీంతో మనస్తాపం చెందిన గణేశ్‌ క్షణికావేశంలో రూమ్‌లోకి వెళ్లి సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. పిల్లలు గమనించి తల్లికి చెప్పగా ఆమె వచ్చి ఉరి నుంచి కిందకు దించింది. కానీ అప్పటికే గణేశ్‌ మృతి చెందాడు. తండ్రి భూమన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రావణి తెలిపారు.

లైంగికంగా వేధించారని మహిళ ఫిర్యాదు

కడెం: మండలంలోని చిన్నబెల్లాల్‌ జీపీ పరిధిలోని నర్సింగాపూర్‌ గ్రామానికి చెందిన ఇద్దరు నిందితులు, గ్రామ శివారులోని పొదల్లోకి తీసుకెళ్లి తనను లైంగికంగా వేధించారని ఒక మహిళ సోమవారం ఫిర్యాదు చేసినట్లు ఎస్సై సాయికిరణ్‌ తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించామని, బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement