ఆదిలాబాద్‌టౌన్: సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ఐక్యంగా ఉద్యమించాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఫ్యాక్టరీ పునరుద్దరణ, ప్రస్తుత పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై సోమవారం జిల్లా కేంద్రంలోని సుందర య్య భవనంలో చర్చా గోష్టి నిర్వహించారు. ప లువురు మేధావులు, కళాకారులు, ఆయా సంఘాల నాయకులు పాల్గొని సీసీఐ పునరుద్ధరణకు కేంద్రంపై ఒత్తిడి పెంచేలా ఉద్యమించా లని తీర్మానం చేశారు. ఈ సందర్భంగా రామ న్న మాట్లాడుతూ, 13 ఏళ్లుగా కేంద్రంలో అధి కారంలో ఉన్న బీజేపీ సర్కారు సీసీఐపై ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదన్నారు. 2022లో సీసీఐ సాధన సమితి ఏర్పాటు చేసి సిమెంట్ ప రిశ్రమ పునఃప్రారంభం కోసం ఉద్యమిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి సీసీఐ పునరుద్దరణపై కేంద్రంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీసీఐ సాఽ దన సమితి కన్వీనర్ దర్శనాల మల్లేశ్, కో కన్వీ నర్ నారాయణ, బండి దత్తాత్రి, నగేష్, సంగెపు బొర్రన్న, నారాయణ, మంజుల, స్వప్న, కిరణ్, సచిన్, వెంకటనారాయణ పాల్గొన్నారు.


