సమస్యలు పరిష్కరించాలని ఆందోళన | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించాలని ఆందోళన

Jul 20 2026 11:36 PM | Updated on Jul 20 2026 11:36 PM

ఆదిలాబాద్‌టౌన్‌: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సివిల్‌ సప్లయ్‌ హమాలీలు సోమవారం ఆందోళన చేపట్టారు. తెలంగాణ సివిల్‌ సప్లయ్‌ హమాలీ యూనియన్‌ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.విలాస్‌ మాట్లాడుతూ, హమాలీలకు ప్రతినెల 10వ తేదీలోపు బిల్లులు చెల్లించి సకాలంలో వేతనాలు అందించాలని డి మాండ్‌ చేశారు. అనంతరం డిమాండ్లతో కూ డిన వినతిపత్రాన్ని ఆర్డీవో జగదీశ్వర్‌రావుకు అందజేశారు. కార్యక్రమంలో యూనియన్‌ జి ల్లా అధ్యక్షుడు ఎం.రమేశ్‌, ప్రధాన కార్యదర్శి దేవేందర్‌, నాయకులు షేక్‌ సలీం, వెంకటేశ్‌, షేక్‌ మోసిన్‌, కిశోర్‌, రాజేందర్‌, అహ్మద్‌, ఊష న్న, తబ్రేజ్‌, రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement