ఆదిలాబాద్‌టౌన్: సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని టీఎస్ సీపీఎస్‌ఈయూ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని బాలక్ మందిర్ పాఠశాలలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో జ నజాగరణ యాత్ర పోస్టర్‌ను సోమవారం ఆ విష్కరించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర సహా అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడు తూ పాత పెన్షన్ విధానం అమలు కోరుతూ ఈనెల 24న జిల్లా కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్ని సంఘాలు మద్దతు పలకాలని కోరారు. కార్యక్రమంలో ఆయా ఉపాధ్యాయ సంఘాల నాయకులు చరణ్‌దాస్, పొచ్చన్న, కలీమొద్దీన్, భూమేశ్, వివేక్ భవాని, విజయ్ మోహన్‌రావు, దేవి దాస్, గీతేశ్వర్, హరిచరణ్, విష్ణు పాల్గొన్నారు.


