పశువైద్యం అంతంతే! | - | Sakshi
Sakshi News home page

పశువైద్యం అంతంతే!

Jul 20 2026 11:36 PM | Updated on Jul 20 2026 11:36 PM

● జిల్లాలో వెక్కిరిస్తున్న ఖాళీలు ● ఉన్నవారిపై అదనపు బాధ్యతలు ● సకాలంలో సేవలందక మూగజీవాల మృత్యువాత

ఇచ్చోడ: జిల్లాలో పశువైద్య సేవలు అంతంత మాత్రంగా మారాయి. వైద్యపోస్టులు ఖాళీగా ఉండడంతో ఉన్నవారిపై అదనపు భారం పడుతోంది. తద్వారా సేవలపై ప్రభావం చూపుతోంది. ఇక్కడి రైతులు వ్యవసాయానికి అనుబంధంగా పశుపోషణ చేస్తుంటారు. అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనా ఆర్థికభారం నుంచి గట్టెక్కడానికి ఇది కొంత దోహదపడనుంది. అయితే జిల్లా వ్యాప్తంగా పశువైద్యాధికారుల పోస్టులు ఏళ్లుగా ఖాళీగా ఉన్నాయి. దీంతో సకాలంలో సరైన వైద్యం అందక మూగజీవాలు మృత్యవాత పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

అదనపు బాధ్యతలు..

జిల్లా వ్యాప్తంగా చాలా మండలాల్లో పశువైద్యాధి కారులు లేక పోవడంతో ఉన్నవారితోనే ఆ శాఖ నె ట్టుకోస్తున్నట్లు కనిపిస్తుంది. దీంతో పలు మండలా ల్లో రెగ్యులర్‌ వైద్యులు లేక ఉన్న వారికే అదనపు బాఽ ద్యతలు ఇవ్వడంతో వారు పూర్తిస్థాయిలో సేవలు అందించలేక పోతున్నారు. వారు దూరభారం, అదనపు బాధ్యతలతో సతమతమవుతున్నట్లు తెలు స్తోంది. ఇచ్చోడలో పనిచేస్తున్న పశువైద్యాధికారి ఇటీవల నేరడిగొండ మండలంలోని వాంకిడికి బది లీ అయ్యారు. ఆయన స్థానంలో ఇచ్చోడకు ఎవరూ రాకపోవడంతో బేల పశువైద్యాధికారికి అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే బజార్‌హత్నూర్‌ పశువైద్యాధికారిని ఇటీవల భోరజ్‌ మండలంలోని గిమ్మకు బదిలీ చేశారు. ఆయనకే బజార్‌హత్నూర్‌ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇంద్రవెల్లి పశువైద్యాధికారికి సిరికొండకు అదనపు బాధ్యతలు అప్పగించారు. భీంపూర్‌ పశువైద్యాధికారి ఇటీవల బదిలీపై వేరే జిల్లాకు వెళ్లగా తాంసి పశువైద్యాధికారికి అదనపు బాధ్యతలు అప్పగించారు.

వెక్కిరిస్తున్న ఖాళీలు..

జిల్లాలో బోథ్‌, భీంపూర్‌, సిరికొండ, ఇచ్చోడ, బజా ర్‌హత్నూర్‌, గాదిగూడ, తాడిహత్నూర్‌, నార్నూర్‌ మండలాల్లో పశువైద్యాధికార పోస్టులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. అదనపు బాధ్యతలు అప్పగించిన వైద్యులు సమయానికి రాక పోవడంతో అటెండర్లే పశువులకు వైద్యం అందిస్తున్న పరిస్థితి.

ఉన్నవారికే అదనపు బాధ్యతలు..

జిల్లాలో ఎనిమిది పశువైద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల జరిగిన బదిలీల్లో కొంత మంది సొంత జిల్లాలకు వెళ్లారు. ఈ క్రమంలో ఉన్న వారికే అదనపు బాధ్యతలు అప్పగించి సేవలకు ఆటంకం కలగకుండా చూస్తున్నాం.

– రామారావు, జిల్లా పశువైద్యాధికారి

పశుసంపద వివరాలు

ఆవులు 3.50 లక్షలు

మేకలు 2.50 లక్షలు

గొర్రెలు 85 వేలు

గేదెలు 51 వేలు

జిల్లాలో

పశువైద్యశాలలు 22

వైద్యుల సంఖ్య 14

ఖాళీలు 8

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement