ఆదిలాబాద్‌టౌన్: మాజీ మంత్రి స్వర్గీయ చిల్కూరి రామచంద్రారెడ్డి పేదల గుండెల్లో పదిలంగా ఉన్నారని ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని సీఆర్‌ఆర్ నివాసంతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రామచంద్రారెడ్డి వర్ధంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సీఆర్‌ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాలులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మత్తడి వాగు, రిమ్స్‌తో పాటు జిల్లా అభివృద్ధికి సీఆర్‌ఆర్ చేసిన సేవలు కొనియాడారు. కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, మున్సిపల్ మాజీ చైర్మన్ దిగంబర్రావు పాటిల్, చంద్రశేఖర్, అశోక్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంజీవరెడ్డి, శేఖర్, వసీం, ఖీజర్‌పాషా, నగేష్, అనిల్ పాల్గొన్నారు.
సీఆర్‌ఆర్ సేవలు చిరస్మరణీయం..
సీఆర్‌ఆర్ సేవలు చిరస్మరణీయమని సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి అన్నారు. రామచంద్రారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందులో లక్ష్మారెడ్డి, కౌన్సిలర్ అశోక్, జహీర్, హిమాబిషేక్ రెడ్డి, రాహుల్ పాల్గొన్నారు.


